Sunday, March 12, 2006

బామ్మగారి సిగరెట్టు

మొన్నా మధ్య నా మిత్రులతో కలిసి కన్యాకుమారి వెల్లాల్సివచ్చింది. అక్కడికి చేరు కునే సరికి రాత్రి 9:30 అయ్యింది. హోటలులో గది అద్దెకు తీసుకుని భొజనానికి బయటకు వచ్చాము. బోజనం తరువాత ఫోను చేసుకోవడానికి ఒక పాన్ షాపు దగ్గర ఆగాము. ఇంత మన కధానయిక గారు అప్పుడే మా దృష్టిలో పడ్డారు. ఆమె ఎవరో అప్పుడే కింద పడెసిన ఒక సిగరెట్టు ముక్కను ఎరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఏరుకుని అరవంలో ఏదో గట్టిగా మాట్లాడుతున్నారు. ఒక్క ముక్క ర్ధమయితే ఒట్టు.

ఇంతలో Sumit నా దగ్గర ఉన్న కెమెరాను లాక్కుని, దానిని ఆమెకు చూపిస్తూ ఫోటో అని అరిచాడు. వెంటనే ఒక మంచి ఫోసు ఇచ్చి ఫొటో తీయించుకుంది. ఫొటో తీసిన తరువార ఏదో గబగబా మాట్లాడింది (బహుశా ఫొటో బాగానే వచ్చిందా అని అడిగి ఉంటుంది.) ఇంకొంత సేపటి తరువాత ఆమే నోటినుండి సిగరెట్ అనే పదం వెలువడింది, అప్పటి దాకా ఏం మాట్లాడిందో అస్సలు అర్ధం కాలేదు, బహుశా సిగరెట్టు ఇమ్మని అడుగుతుందేమో. కానీ మేమెవరం సిగరెట్టు తాగమే మరి.
Old Lady at Kanyakumari Smoking Cigarette

ఇంకొంచెం సేపటి తరువాత ఏదో ఆప్యాయంగా మాట్లాడటం మొదలు పెట్టింది. ఉహూ! ఏమాత్రం అర్ధం అవ్వటం లేదు. వెనుకనే ఉన్న పాన్ షాపు యజమాని ఆమే మీ గురించి కుశల ప్రశ్నలు అడుగుతుందని, సిగరెట్లు తాగకూడదని చెబుతుందని వెవరించాడు. ఇంతలో ఎవరో ఇంకో సిగరెట్టు పడేసారు, ఈవిడ ఆ సిగరెట్టును ఏరుకుని తృప్తిగా పొగతాగటం మొదలు పెట్టింది.

Recently, I, along with my friends, went to KanyaKumari for a little bit of site seeing. We reached there by 9:30 PM booked our room in a hotel. Then came out to have our dinner. After dinner we were waiting at a telephone booth cum pan shop. This is when the heroin of the story entered in to picture. She was trying to pick the cigarette thrown away freshly. She was talking something loudly in tamil. I have no idea on what topic she is talking so loudly.

Sumit suddenly grabbed the camera from me and shouted "photo" at her by showing the camera. Immediately she gave us a wonderful pose. The camera captured the pose with a flash. Suddenly, she started talking fastly with Sumit. No wonder we did not understand what she was talking. After hearing the word cigarrette, we assumed that that she was asking for a cigarrete from us. But, sorry no one among us smoked.
Old Lady at Kanyakumari Smoking Cigarette

Few moments later a caring expression appeared on her face. And started talking with us and waiting for some moments as if she was expecting answers from us. The pan shop owner now managed to translate that she was asking about our father's name etc.., and how she was trying to explain us that smoking is not good for our health. Some one has thrown another cigarrete and she got diverted towards the cigarrette, making her to forget us. She once again started smoking happily.

No comments:

Post a Comment